తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓట్లు చీల్చడానికే బరిలో కోదండరాం: చెరుకు సుధాకర్ - Telangana inti Party President Latest News

సూర్యాపేట జిల్లాలో ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

Telangana inti Party President Cheruku Sudhakar talk about mlc elctions
ఓట్లు చీల్చడానికే బరిలో కోదండరాం: చెరుకు సుధాకర్

By

Published : Nov 5, 2020, 11:00 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎంఎస్​ కళాశాల ప్రాంగణంలో పట్టభద్రులు, ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకొని ఓట్లడుగుతారని అన్నారు. పల్లా రాజశేఖర్ రెడ్డికి నోట్ల కట్టలపై ఉన్న చిత్తశుద్ధి.. నిరుద్యోగుల సమస్యల మీద లేదని ఎద్దేవా చేశారు. ఓట్లు చీల్చాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ బరిలో ఉన్నట్లు ఆరోపించారు.

మండలిలో ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోవాల్సిందిగా పట్టభద్రులకు సూచించారు. ఎన్నో ఉద్యమాలు,ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఓ నియంతలా పాలిస్తున్న కేసీఆర్ పతనానికి నాందిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిలుస్తుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details