తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Genco: విద్యుత్‌ ఉత్పత్తి పెంపు.. మూడో యూనిట్ కూడా.!

తెలుగు రాష్ట్రాల మధ్య ఒక వైపు కృష్ణా జలాల వివాదం నడుస్తుంటే మరోవైపు తెలంగాణ విద్యుత్​ ఉత్పత్తిని మరింత పెంచింది. సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పత్తిని ఒక్కసారిగా రాష్ట్ర జెన్​ కో అధికారులు పెంచారు. ప్రాజెక్టులోని మూడు యూనిట్లలో తెలంగాణ జెన్‌కో కరెంట్‌ ఉత్పత్తి చేస్తోంది.

Telangana Genco
Telangana Genco

By

Published : Jul 5, 2021, 8:58 PM IST

సూర్యాపేట జిల్లా పులిచింతలలో విద్యుత్‌ ఉత్పత్తిని తెలంగాణ జెన్‌కో మరింత పెంచింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 50 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. పులిచింతలలోని మూడు యూనిట్లలో తెలంగాణ జెన్‌కో కరెంట్‌ ఉత్పత్తి చేస్తూ.. 9,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఉత్పత్తిని పెంచడం చర్చనీయాంశమవుతోంది. అంతకు ముందు 24 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్లు ఏపీ అధికారులు తెలిపారు.

ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం పెరుగుతున్న జలాశయాల్లో... విద్యుదుత్పత్తిని పెంచుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరగడంతో... మూడో యూనిట్​ను అందుబాటులోకి తెచ్చారు. నాగార్జునసాగర్ వద్ద రోజూ మాదిరిగానే ఉత్పత్తి చేపడుతుండగా... రెండు ప్రాజెక్టుల వద్ద పటిష్ఠ భద్రత కొనసాగుతోంది.

సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ నుంచి 33 వేల 618 క్యూసెక్కుల వరద వస్తున్న దృష్ట్యా... జెన్ కో అధికారులు విద్యుదుత్పత్తిని పెంచారు. మధ్యాహ్నం నుంచి మరో యూనిట్​ను ప్రారంభించారు. ఇప్పటివరకు రెండు యూనిట్లు నడుస్తుండగా... తాజాగా మరో యూనిట్​ను అందుబాటులోకి తెచ్చారు. పులిచింతలలో 30 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లు నాలుగు ఉంటే అందులో రెండింటిలో ఇప్పటివరకు 15 మెగావాట్ల చొప్పున విద్యుదుత్పత్తి అయింది. 30 మెగావాట్లతో కొనసాగుతున్న ఉత్పత్తికి మూడో యూనిట్​ను జోడించి మరో 20 మెగావాట్లతో... మొత్తం 50 మెగావాట్లకు పెంచారు. విద్యుదుత్పత్తితోపాటు లీకేజీల ద్వారా పులిచింతల నుంచి.. 9 వేల 9 వందల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. 45.77 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గాను ప్రస్తుతం... 31.21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. .

నాగార్జునసాగర్​లో యథాతథం

నాగార్జునసాగర్లో మాత్రం ఇంతకుముందు మాదిరిగానే ఉత్పత్తి కొనసాగుతోంది. జూన్ 29 నాడు మధ్యాహ్నం సాగర్​లో అదే రోజు రాత్రి ఎనిమిదిన్నరకు పులిచింతలలోని యూనిట్లలో ఉత్పత్తి మొదలైంది. నాగార్జునసాగర్ కేంద్రంలో 8 యూనిట్ల ద్వారా 660 మెగావాట్ల ఉత్పత్తి చేపడుతున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 30 వేల 761 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్​ 312.04 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గానూ 173.86 నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 590 అడుగుల గరిష్ఠ నిల్వకు గానూ ప్రస్తుతం... ప్రస్తుతం 532 అడుగుల మేర నీరుంది. విద్యుదుత్పత్తిలో భాగంగా రోజుకు... 30 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఇక రెండు జలాశయాల వద్ద పటిష్ఠ బందోబస్తు కొనసాగుతోంది. జిల్లాల ఎస్పీల పర్యవేక్షణలో... ప్రత్యేక బలగాల్ని మోహరించి పహారా కాస్తున్నారు.

ఇవీ చూడండి:

TS-AP WATER WAR: 'ఆ రెండు ప్రాజెక్టుల్లో నిరంతరంగా జల విద్యుత్​ ఉత్పత్తి'

TS-AP WATER WAR:ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా

ABOUT THE AUTHOR

...view details