తెలంగాణ

telangana

By

Published : Nov 22, 2019, 12:43 PM IST

ETV Bharat / state

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ద్వితీయ మహాసభలు

డిసెంబర్ 15 నుంచి 17 వరకు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ద్వితీయ మహాసభలు జరగనున్నాయి.

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ద్వితీయ మహాసభలు

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ద్వితీయ మహాసభలు డిసెంబర్ 15 నుంచి 17 వరకు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో జరుగుతాయని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం 2019 ముసాయిదా చట్టం రైతాంగానికి అనుకూలం కాదని ఆమె పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వం విత్తనం మీద పెత్తనం చలాయించాలని చూస్తోందని... అందుకే కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా విత్తన చట్టం తీసుకొచ్చేందుకు యత్నంస్తోందని ఆరోపించారు. సెక్షన్ 21 ప్రకారం 1950 వినియోగదారుల చట్టం ప్రకారం రైతులు నష్టపోతే నకిలీ విత్తనాలకు మాత్రమే డబ్బు చెల్లిస్తామని అంటున్నారే తప్ప... పూర్తి స్థాయి నష్టం ఇచ్చేలా చట్టం తేవట్లేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ద్వితీయ మహాసభలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details