పట్టభధ్రుల ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని తీన్మార్ మల్లన్న కోరారు. తీన్మార్ మల్లన్న పాదయాత్రలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లయినా ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని మల్లన్న విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి వారి నుంచి 3 వేల ఎకరాల భూమిని సీఎం కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు.
నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది: తీన్మార్ మల్లన్న - teenmar mallanna mlc election campaign
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లయినా ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేదని.. నిరుద్యోగులను మోసం చేసిందని తీన్మార్ మల్లన్న విమర్శించారు. దళితులను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఆయన ప్రచారం నిర్వహించారు.
నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది: తీన్మార్ మల్లన్న
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరు చెప్పి సీఎం పబ్బం గడుపుతున్నారని మల్లన్న అన్నారు. రాష్ట్రంలో ఉన్న తెరాస నాయకులు.. అధికార పార్టీ అండదండలతో వ్యాపారాలు, భూ దందాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 2014లో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఏ ఒక్క రోజు కూడా చట్టసభల్లో నిరుద్యోగుల సమస్యలను గురించి ప్రశ్నించలేదని అన్నారు. ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వేయలేదని ఆరోపించారు.
ఇదీ చదవండి:పీసీసీ చీఫ్ ఎంపికపై వీడని ఉత్కంఠ... సీనియర్లలో ఆందోళన