తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశ్నించే గొంతుకు ఓటు వేయండి: తీన్మార్ మల్లన్న

దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తెరాసకు తగిన గుణపాఠం చెప్పారని ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్​ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తనకు ఓటు వేసి మండలికి పంపిస్తే.. ప్రజల తరపున ప్రశ్నించే వ్యక్తిగా ఉంటానని అన్నారు. తన పాదయాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ప్రచారం నిర్వహించారు.

teenmar-mallanna-compaign-in-huzurnagar-in-suryapet-district
ప్రశ్నించే గొంతుకు ఓటు వేయండి: తీన్మార్ మల్లన్న

By

Published : Dec 8, 2020, 11:30 PM IST

ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన పాదయాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ప్రచారం జరిపారు. ఈ సందర్భంగా అధికార తెరాస పార్టీపై నిప్పులు చెరిగారు.

హుజూర్​నగర్​లో గెలిచిన తర్వాత మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు.. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన తెరాస.. వాటిని అమలు చేయలేదని మల్లన్న ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికి.. ఇంత వరకు ఇవ్వలేదని మండిపడ్డారు.

శాసనమండలిలో ప్రశ్నించే గొంతును గెలిపించాలని.. తనకు ఓటు వేసి మండలికి పంపిస్తే ప్రజల తరపున ప్రశ్నించే వ్యక్తిగా ఉంటానని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తెరాసకు బద్ధి చెప్పారన్న ఆయన.. ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను మండలికి పంపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కవిత ఆందోళన చేపట్టిన చౌరస్తాను శుభ్రం చేసిన భాజపా

ABOUT THE AUTHOR

...view details