తెలంగాణ

telangana

ETV Bharat / state

పని ఒత్తిడితో ఉపాధ్యాయుడి ఆత్మహత్య - teacher suicide due to work pressure

ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. జీవితాన్ని ఆనందంగా గడపొచ్చని కలలు కన్నాడు. కానీ నాలుగు నెలలకే పని ఒత్తిడి వలన బతుకుపై విరక్తి చెంది.. తల్లిని క్షమించమంటూ సూసైడ్​ నోట్​ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ఉపాధ్యాయుడు.

పని ఒత్తిడితో ఉపాధ్యాయుడి ఆత్మహత్య

By

Published : Oct 23, 2019, 6:34 PM IST

పని ఒత్తిడితో ఉపాధ్యాయుడి ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం అలుగునూర్​కు చెందిన పట్టేటి విద్యాసాగర్ (32) నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని టీఎస్ ఆర్​డబ్ల్యూఎస్ గురుకులంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. తిప్పర్తిలో స్కూల్​కు సరైన వసతులు లేక పోవడం వల్ల నల్గొండలో నిర్వహిస్తున్నారు. దసరా సెలవులకు తన స్వగ్రామంలో తల్లి శాంతమ్మ వద్ద ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. పాఠశాల అధికారుల ఒత్తిడి తట్టుకోలేక తిరిగి ఇంటికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు."జాబ్ వచ్చింది. మంచి జీవితాన్ని ఆస్వాదించవచ్చు అనుకున్నా. కానీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆనందాన్ని కోల్పోయాను. పాఠశాల పని చేసుకోనివ్వకుండా పనికిమాలిన పనులు చెబుతూ ఫలితాలు మంచిగా రావాలి అని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు" అని విద్యాసాగర్​ తన సూసైడ్ నోట్​లో తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details