సూర్యాపేట జిల్లా గుర్రంపోడు తండా పెదవీడు శివారులో సర్వేనంబర్ 540లో గల 6 వేల ఎకరాల వివాదాస్పద భూములను తెతెదేపా మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బాధితులకు అండగా ఉంటుందని... మీ భూములు మీకు వచ్చే వరకు పోరాటం చేస్తుందని ఆమె భరోసానిచ్చారు.
'బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది'
సూర్యాపేట జిల్లా గుర్రంపోడు తండా పెదవీడు శివారులో సర్వేనంబర్ 540లో గల 6 వేల ఎకరాల వివాదాస్పద భూములను తెతెదేపా మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడారు.
'బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది'
మీ దగ్గరికి ఎవరైనా వస్తే తమ దగ్గర ఉన్న కాగితాలు చూపించాలని సూచించారు. గిరిజనులు ఈ భూములను 60, 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. బాధితులకు భూములు ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి దయాకర్ అన్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.
ఇదీ చదవండి :అనుమతి లేని ప్రాజెక్టుల పనులు ఆపేయండి : కృష్ణాబోర్డు