తెలంగాణ

telangana

ETV Bharat / state

సీపీఎం జిల్లా నాయకుడికి తమ్మినేని వీరభద్రం నివాళి - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

గుండెపోటుతో అకాలం మరణం చెందిన సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కుక్కడపు ప్రసాద్​ భౌతికకాయానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళి అర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు.

Tammineni Veerabhadram pays tributes to CPM district leader kukkadapu prasad
సీపీఎం జిల్లా నాయకుడికి తమ్మినేని వీరభద్రం నివాళులు

By

Published : Aug 24, 2020, 12:02 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కుక్కడపు ప్రసాద్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. కుక్కడపు ప్రసాద్ భౌతికకాయానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పూల మాల వేసి నివాళులర్పించారు.

సీపీఎం పార్టీకి ఎనలేని కృషి చేసిన కుక్కడపు ప్రసాద్ అకాల మరణం... పార్టీకి తీరని లోటని తమ్మినేని వీరభద్రం అన్నారు. జిల్లాలోని సీపీఎం పార్టీ నాయకులందరూ భౌతికకాయానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి: వీహెచ్​పీ నిరసనల్లో పాల్గొని హిందువుల ఐక్యత చాటుదాం: బండి

ABOUT THE AUTHOR

...view details