భారతీయ జనతా పార్టీ ఫాసిస్టు లక్షణాలున్న పార్టీ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సూర్యాపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న తమ్మినేని... కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోదీ ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేసిందంటూ మండిపడ్డారు.
భాజపా పాలన దుర్మార్గం: తమ్మినేని - BJP
దేశంలో మళ్లీ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు కమల దళం ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆక్షేపించారు. ఐదేళ్లలో ప్రజలకు దుర్మార్గపు పాలన అందించారంటూ విమర్శలు చేశారు.

సీపీఐ జిల్లా స్థాయి సమావేశాలు
Last Updated : Mar 17, 2019, 6:15 PM IST