తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్ బిల్లులు సవరించాలని కోరుతూ సీపీఐ ఆందోళన - సూర్యాపేట జిల్లా కోదాడలో సీపీఐ కార్యకర్తల ధర్నా

సూర్యాపేట జిల్లా కోదాడలో విద్యుత్ బిల్లులను సవరించాలంటూ సీపీఐ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 1500 రూపాయలను రాబట్టేందుకే బిల్లులు ఎక్కువ చేశారని ఆరోపించారు.

cpi leaders protest in suryapeta
విద్యుత్ బిల్లులు సవరించాలంటూ సీపీఐ నేతల ఆందోళన

By

Published : Jun 15, 2020, 5:17 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోదాడ ట్రాన్స్​కో ఏడిఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పేద ప్రజలకు రావాల్సిన బిల్లులకంటే అధిక బిల్లులు రావడం వల్ల వారి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వం అందించిన 1500 రూపాయలను తిరిగి రాబట్టడానికే అధిక విద్యుత్ బిల్లులు వేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే విద్యుత్ బిల్లులను సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ ఏఈ సైదాకు వినితిపత్రం అందజేశారు.

ఇవీ చూడండి:దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details