తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా: ఎస్పీ భాస్కరన్​ - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ హెచ్చరించారు. చిలుకూరు పీఎస్​ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. అక్రమ వ్యాపారాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా పెట్టామని వెల్లడించారు.

అక్రమాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా: ఎస్పీ భాస్కరన్​
అక్రమాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా: ఎస్పీ భాస్కరన్​

By

Published : Jun 9, 2020, 5:30 PM IST

సూర్యాపేట జిల్లా చిలుకూరు పోలీస్​ స్టేషన్​ను జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి పెండింగ్​లో ఉన్న కేసులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో అక్రమ వ్యాపారాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ వెల్లడించారు.

గత మూడు సంవత్సరాలుగా పీడీఎస్ బియ్యం, గుట్కా, ఇసుక, గంజాయి, నల్లబెల్లం లాంటి అక్రమ వ్యాపారాలు చేసేవారి వివరాలను క్రైమ్​ బ్యూరోలో సిద్ధం చేశామని వెల్లడించారు.

ఇవీ చూడండి:యాపిల్​ విత్తనాలు తినేశారా? వాటిల్లో విషం ఉంటుందని తెలుసా!

ABOUT THE AUTHOR

...view details