సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో జిల్లా అదనపు కలెక్టర్ సంజీవరెడ్డి పర్యటించారు. జూన్ 1 నుంచి 8 వరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కోదాడలో అదనపు కలెక్టర్ పర్యటన - కోదాడ వార్తలు
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అదనపు కలెక్టర్ సంజీవరెడ్డి పర్యటించారు. కోదాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. జూన్ 1 నుంచి 8 వరకు తారీఖు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు వందశాతం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా మురుగు కాల్వలు శుభ్రం చేస్తూ.. నిల్వ నీరు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి వార్డుల్లోమురికి కాల్వల్లో చెత్తను తొలగించడమే కాక.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని.. ఆ దిశగా కార్యచరణ అమలు చేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా సమస్యలు వస్తే.. వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీషకు సూచించారు.
ఇదీ చదవండి:'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం