తెలంగాణ

telangana

ETV Bharat / state

పులిచింతల ముంపు గ్రామాల్లో కలెక్టర్ పర్యటన - collector

సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులు... పరిహారం అందలేదని కలెక్టర్​కు మొరపెట్టుకున్నారు. ఉపాధి కోసం రుణాలు మంజూరు చేయాలని కోరారు.

పులిచింతల ముంపు గ్రామాల్లో కలెక్టర్ పర్యటన

By

Published : Jun 29, 2019, 7:38 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో కలెక్టర్ అమాయ్​కుమార్ పర్యటించారు. ఇప్పటి వరకూ ఇళ్ల స్థలాలు, పరిహారం అందలేదని బాధితులు కలెక్టర్​కు మొరపెట్టుకున్నారు. కొత్తగా నిర్మించిన ఆర్​ అండ్​ ఆర్​ కేంద్రంలో కనీసం సదుపాయాలు లేవని ఆవేద వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ, పాఠశాల నిర్మించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన వారికి మత్స్య కార్మికులకు రాయితీ రుణాలు మంజూరు చేయాలని కోరారు.

పులిచింతల ముంపు గ్రామాల్లో కలెక్టర్ పర్యటన

ABOUT THE AUTHOR

...view details