పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పలు శాఖలపై దృష్టి సారించారు. అనుమతి లేకుండా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకుంటున్నారు. అనుమతిలేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్ల హద్దు రాళ్లను తొలగించాలని ఆదేశించారు. అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. నకిలీ పత్రాలతో వచ్చే వారిపట్ల కఠినంగా వ్యవహారించాలని రిజిస్టర్ అధికారులకు తగు సలహాలిచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా బాధ్యతలు నిర్వహించాలని అక్కడి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. అధికారుల ఉరుకులు.. - SURYAPETA COLLECTOR CONTINGENCY CHECKS
పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పలు శాఖల్లో ఆకస్మిక తనిఖీలు జరిపి అధికారులను పరుగులు పెట్టించారు.

ఎఫెక్ట్: 'విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు ఇవ్వండి'జిల్లా కేంద్రంలో 13 బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఉన్నట్లు పురపాలక సంఘం అధికారుల నుంచి తెలుసుకున్న కలెక్టర్... ఆయా అపార్ట్ మెంట్లలో భవన యజమానులు తీసుకుంటున్న రక్షణ చర్యలను పరిశీలించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ బహుళ అంతస్తు భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన... భవన యాజమాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్లార్‌ను వ్యాపార అవసరాలకు ఉపయోగించడాన్ని ప్రశ్నించారు. సెల్లార్ విభాగంలో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టవద్దని భవన యజమానిని ఆదేశించారు.
ఇవీ చూడండి:ఎఫెక్ట్: 'విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు ఇవ్వండి'