రోజూ ఆన్లైన్ తరగతులు తప్పనిసరిగా వినాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య సూచించారు. గానుగుబండ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదివే దివ్యాంగుల ఇళ్లకు సోమవారం వెళ్లి ఆన్లైన్ తరగతులను పరిశీలించారు. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
ఆన్లైన్ తరగతులను పరిశీలించిన తుంగతుర్తి ఎంఈవో - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో ఎంఈవో బోయిని లింగయ్య ఆన్లైన్ తరగతులను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో చదివే దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి రోజూ ఆన్లైన్ తరగతులు తప్పనిసరిగా వినాలని సూచించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమని చెప్పారు.
![ఆన్లైన్ తరగతులను పరిశీలించిన తుంగతుర్తి ఎంఈవో suryapet district tungaturti MEO examining online classes at ganugubanda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9067742-1097-9067742-1601970580519.jpg)
ఆన్లైన్ తరగతులను పరిశీలించిన తుంగతుర్తి ఎంఈవో
పిల్లలు ఆన్లైన్ తరగతులు వింటున్నారా... లేదా అని తల్లిదండ్రులు నిత్యం పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గుడిపాటి అనిత, ఐఈఆర్టీ ఉపేందర్, మధుకర్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.