తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్తి కోసం అమ్మను, చెల్లిని చంపేశాడు! - Suryapet District today News

suryapet district murder latest news
suryapet district murder latest news

By

Published : Feb 6, 2020, 8:09 AM IST

Updated : Feb 6, 2020, 3:53 PM IST

07:26 February 06

తల్లీ, కూతురు దారుణ హత్య

తల్లీ కూతురు దారుణ హత్య

ఆస్తి కోసం అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. ఎంతటి  నేరానికైనా వెనుకంజ వేయడం లేదు. ఆస్తి తనకే దక్కాలన్న కుట్రతో సవతి తల్లిని, ఆమె కూతురును హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. నిందితుడు రోకలిబండతో ఇద్దరిని హత్యచేసి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

       సూర్యాపేట మండలం తాళ్ల ఖమ్మంపహాడ్​లో ఈరోజు తెల్లవారుజామున తల్లీకూతురు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన కప్పల హరీశ్​ అనే యువకుడు సవతి తల్లి అంజమ్మ,  ఆమె కూతురు మౌనికను హత్య చేశాడు. ఆస్తి తనకే దక్కాలన్న స్వార్థంతో వారిని అంతమొందించాడు. రోకలి బండతో తలపై మోది ఇద్దరి ప్రాణాలు తీశాడు. మౌనిక ఇటీవల సీఏ పరీక్షలో మంచి మార్కులు సాధించింది.  

       అంజమ్మ వేకువజామున ఇంటి ముందు కల్లాపి చల్లి ఇంట్లోకి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన హరీశ్​ రోకలి బండతో ఆమె తలపై మోదాడు. తరువాత ఇంట్లో నిద్రిస్తున్న మౌనిక తలపై మోదడం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మౌనిక మృతదేహాన్ని... హరీశ్​ తల్లి ఇంటి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి వదిలేసింది. తల్లీకొడుకు కలిసి హత్యకు పథకం వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆస్తి తగాదాలే కారణం..!

      తాళ్ల ఖమ్మంపహాడ్​కు చెందిన కప్పల నాగయ్యకు పిల్లలు పుట్టక పోవడం వల్ల మొదటి భార్య  చెల్లెలైన అంజమ్మను వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులకే  మొదటి భార్యకు కుమారుడు, రెండో భార్యకు కూతురు జన్మించారు. ఇలా సంసారం సాగిపోతున్న ఈక్రమంలో  కుటుంబ కారణాలతో కప్పల నాగయ్య గత 13 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.  

          నాగయ్య మరణం తర్వాత ఆస్తి పంపకాల్లో తగాదాలు జరుగుతున్నాయి. మొదటి భార్యకు కూతురు, కుమారుడు, రెండో భార్య అంజమ్మ(మృతురాలు)కు ఓ కూతురు ఉంది. ఇటీవలికాలంలో పెద్దల సమక్షంలో ఆస్తి పంపకాలు జరిగాయి. చెల్లింపుల విషయంలో వీరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం.  

ఇదీ చూడండి :మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..

Last Updated : Feb 6, 2020, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details