పట్టభద్రులు తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.
'పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలి' - Suryapet District Latest News
సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ తీరు పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పీ భాస్కరన్ తెలిపారు.

ఓటు వేసిన సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్
ఎస్పీ భాస్కరన్, పాలనాధికారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి:ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి: సీపీ సజ్జనార్