సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ శ్రీ నల్ల కట్ట సంతాన కామేశ్వరి సమేత శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్తీక మాసం పూజలు నిర్వహించారు. కార్తీకమాసంలో రెండో సోమవారం కావడం, శివ లింగంపై సూర్యకిరణాలు పడడం వల్ల ఈ సుందర దృశ్యాన్ని చూడడానికి భక్తులు ఎగబడ్డారు.
కార్తీక సోమవారం నాడు శివలింగంపై సూర్యకిరణాలు
కార్తీక మాసం రెండో సోమవారం కావడం... శివలింగంపై సూర్యకిరణాలు పడటం వల్ల సూర్యాపేట జిల్లాలోని శ్రీ నల్ల కట్ట సంతాన కామేశ్వరి సమేత శంభు లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
కార్తీక సోమవారం నాడు శివలింగంపై సూర్యకిరణాలు
వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుద్రాభిషేకాలు, సహస్ర నామ బిల్వార్చన, అష్టోత్తర శతనామావళి, మంత్రపుష్పం జరిపారు. తదనంతరం తీర్థ ప్రసాదాలు పంచారు.
ఇవీ చూడండి: కాచిగూడ వద్ద కర్నూలు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను ఢీకొన్న ఎంఎంటీఎస్ రైల్