సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థుల యత్నం
సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థుల యత్నం - sfi
ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట కలెక్టరేట్ ముందు భారత విద్యార్థి సమాఖ్య భారీ ధర్నా చేపట్టింది.

సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థుల యత్నం
సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ విద్యాలయాలు సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవ రెడ్డి విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి : పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ఫిర్యాదులకు సమాధానమేదీ..?