వరసిద్ధి వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని భవాని నగర్లో ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనం, గర్తన్యాసం యంత్రస్థాపన, మహాయాగం, మహా పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను కొంకపాక రాధాకృష్ణమూర్తి వారి శిష్య బృందం నిర్వహించింది.
వైభవంగా వరసిద్ధి వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ - విగ్రహ ప్రతిష్ఠ
సూర్యాపేట జిల్లా కోదాడలో వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
![వైభవంగా వరసిద్ధి వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ Statue of the idol celebrations in suryapet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6055481-65-6055481-1581569805810.jpg)
వైభవంగా వరసిద్ధి వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దంపతులు విమాన కలశం ప్రతిష్ఠలో పాల్గొన్నారు. వేల సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైభవంగా వరసిద్ధి వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ