సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో ఆదివారం.. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్.. స్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. నియోజక వర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విద్యుత్ సరఫరా, వీధి దీపాల కోసం రూ. 50,000 విరాళంగా ఆలయ కమిటీకి అందజేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పడూ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఫణిగిరిలో కన్నులపండువగా సీతారాముల కల్యాణం - Sri Sitaramachandra Swamy kalyanam in phanigiri
సూర్యాపేట జిల్లా ఫణిగిరి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఫణిగిరి, శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
ఉత్సవాల్లో తెరాస మండల అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, ఎంపీపీ కూరం మణి వెంకన్న, మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినర్ పానుగంటి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.