తెదేపా వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినట్లు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మండవ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
'ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి' - ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి
హరిజన, గిరిజన, పీడిత వర్గాల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మండవ వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్టీఆర్ 97వ జయంతిని పురస్కరించుకొని హుజూర్నగర్లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పేద, ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్
ఆయన మొదలు పెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే నేటి వరకు కొనసాగటం విశేషమన్నారు. సినీరంగంలో, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ రారాజుగా వెలుగొందారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.