తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బాధితుల ఇళ్లల్లో ద్రావణం పిచికారీ చేయించిన వైస్ ఎంపీపీ - వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. కొత్తగూడెం గ్రామంలో ఆరుగురికి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో కొవిడ్ బాధితుల ఇళ్లల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

కరోనా బాధితుల ఇళ్లల్లో ద్రావణం పిచికారీ చేయించిన వైస్ ఎంపీపీ
కరోనా బాధితుల ఇళ్లల్లో ద్రావణం పిచికారీ చేయించిన వైస్ ఎంపీపీ

By

Published : Aug 6, 2020, 1:10 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో కరోనా కలకలం రేగింది. గ్రామంలో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా నిర్థరణ కావడం వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం స్వయంగా పిచికారీ చేశారు. కొవిడ్ బాధితుల ఇళ్లల్లోనూ ద్రావణం పిచికారీ చేయించారు. గ్రామస్తులెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

భౌతిక దూరం తప్పనిసరి...

ఆపత్కాలంలో కరోనా మహమ్మారి నిర్మూలణకు వైస్ ఎంపీపీ తీసుకున్న బాధ్యతను గ్రామస్తులు కొనియాడారు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటిస్తూ శానిటైజేషన్ చేసుకోవాలని శ్రీశైలం సూచించారు. మాస్కులు ధరించడం వల్ల వైరస్ బారినపడకుండా నివారించవచ్చని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి బారిన పడిన వారిపై వివక్ష చూపించకుండా వారికి మనోధైర్యం కల్పించాలన్నారు. కొవిడ్ సోకిందని భయపడాల్సిన పనిలేదని..తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'శాంతిభద్రతల స్థాపనలో ఐపీఎస్​ల పాత్ర కీలకం'

ABOUT THE AUTHOR

...view details