తెలంగాణ

telangana

ETV Bharat / state

పచ్చదనం, పారిశుద్ధ్యంతో జిల్లాలోనే మొదటి స్థానం.! - chinthalakunda thanda speciality

పట్టణ ప్రజలకు అందే పార్కుల పచ్చదనం, వైకుంఠధామం ఇతర సౌకర్యాలను పల్లె ప్రజలకు అందించాలనే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్లగతి కార్యక్రమం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో సత్ఫలితాలనిస్తోంది. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, వర్మి కంపోస్టు ఎరువు తయారీ కేంద్రాలు (సిక్రికేషన్ షెడ్​లు), రోడ్లకు ఇరు వైపులా గ్రీనరీని ఏర్పాటు చేసి గ్రామాల రూపురేఖలు మార్చేందుకు నిధులు కేటాయిస్తోంది. వాటిని అందిపుచ్చుకుంటూ తిరుమలగిరి మండలంలోని పలు గ్రామ పంచాయతీలు జిల్లాలో ముందంజలో ఉండగా మండలంలోని చింతలకుంట తండా గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది.

chinthalakunta thanda
చింతలకుంట తండా

By

Published : Mar 28, 2021, 7:31 PM IST

సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లె ప్రగతి అభివృద్ధిపై ర్యాంకు తీయగా చింతలకుంట తండా గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. పదోస్థానంలో రాఘవాపురం, రాజనాయక్ తండా, తాటిపాముల, బండ్లపల్లి గ్రామాలు వరుసగా 16, 17, 18 స్థానాల్లో నిలిచాయి. పాలక వర్గం సహకారంతో పాటు అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూచింతలకుంట తండాలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.

ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం

ప్రత్యేకత:

గత మూడేళ్లుగా వందశాతం ఇంటి పన్ను వసూళ్లు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వందశాతం ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం, 98 శాతం సీసీ రోడ్లు పూర్తి చేశారు.

మొక్కలకు నీరు పోస్తున్న సిబ్బంది

సొంత ఖర్చులతో..

కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు సర్పంచ్​ జాటోతు రవి పేర్కొన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల ఏర్పాట్లు, వందశాతం ఇంకుడుగుంతల, మరుగుదొడ్లు నిర్మాణాలను సొంత ఖర్చులతో తొర్రూరు రోడ్డు వరకు వీధిదీపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తండాలో వర్మి కంపోస్టు ఎరువు తయారీ కేంద్రం

ట్యాంకర్ల ద్వారా చెట్లకు నీరు పోయడం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు ద్వారా చెత్తసేకరణ చేపట్టాం. వారంలో మూడు రోజులు గ్రామంలో స్వచ్ఛ ట్రాక్టర్​ను తిప్పుతాం. పనివాళ్లు అందుబాటులో లేకపోతే నేనే స్వయంగా ట్రాక్టర్ నడుపుతాను. గ్రామ అభివృద్ధిలో భాగంగా, శ్మశానవాటిక, నర్సరీ, బ్లాక్ ప్లాంటీషన్, మంకీ ఫుడ్ కోర్టు, రోడ్డుకు ఇరువైపులా​ చెట్లు నాటించాము.

జాటోతు రవి, సర్పంచ్

మా గ్రామ పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్​లోని పలు పార్కులు చూసి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కృషి చేశాం. అందుకు గాను గ్రామానికి నేడు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ ప్రకృతి వనాన్ని మా గ్రామ ప్రజలే కాకుండా చుట్టు పక్కల గ్రామ ప్రజలు వచ్చి సేద తీరాలనేది నా కోరిక.

జాటోతు అశోక్, ప్రకృతి వనం నిర్వాహకులు

అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టడంతో అందుకు అనుగుణంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, పాలకవర్గం కృషిచేయడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. మండలంలోని 5 గ్రామ పంచాయితీలు జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందాయి. అందులో చింతలకుంట తండా.. జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. మిగిలిన గ్రామాలు ఇదే కోవలో అభివృద్ధిలో నడిచేందుకు కృషిచేస్తాను.

కె. ఉమేష్, మండల అభివృద్ధి అధికారి

పచ్చదనం, పారిశుద్ధ్యంతో జిల్లాలోనే మొదటి స్థానం.!

గ్రామ పంచాయతీలో చేపట్టే ప్రతి పనిని పాలక వర్గం ప్రత్యేక శ్రద్దతో చేస్తున్నారు. వారికి కావలసిన సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నాం. గ్రామ పంచాయతీ భవన నిర్మాణంతో పాటు ఏకగ్రీవ గ్రామ పంచాయతీ నజరానా అందించేందుకు కృషిచేస్తున్నాం.

కె. మా‌రయ్య, ఈఓపీఆర్డీ, తిరుమలగిరి

ఇదీ చదవండి:లాభసాటి పంటలపై రైతులు దృష్టి పెట్టాలి: నిరంజన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details