సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువులోని స్థానిక శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో గత వారం రోజులుగా గుడిలో నాగుపాము దర్శనమిస్తోంది. ఉదయం పూట అర్చకులు దేవాలయం తలుపులు తెరిచే సమయానికి గుడిలోని ధ్వజస్తంభం దగ్గర అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఏడాది క్రితం ఓ సారి గర్భ గుడిలోకి వెళ్లి శివలింగం దగ్గరే నాగాభరణుడై సేదదీరింది.
వారం రోజులుగా ఆ గుడిలోనే తిరుగుతోంది - snake in huzur nagar temple suryapet district
శివుని మెడలో కొలువై ఉండాలని ఆ నాగుపాము తపిస్తుందో ఏమో.. వారం రోజులుగా ఆ గుడిలోనే తిరుగుతోంది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని స్థానిక శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![వారం రోజులుగా ఆ గుడిలోనే తిరుగుతోంది snake in sri syayambhu shambu lingeswara temple suryapet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9034768-1079-9034768-1601720141939.jpg)
వారం రోజులుగా ఆ గుడిలోనే తిరుగుతోంది
విషయం తెలుసుకున్న భక్తులు పరమేశ్వరుని దర్శనానికి పరుగులు పెడుతున్నారు.
ఇదీ చదవండి:భవిష్యత్తులో హైస్కూల్ స్థాయిలోనే ఒకేషనల్ కోర్సులు: కిషన్రెడ్డి