సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ నుంచి పదిహేను రోజుల పాటు లాక్డౌన్ పాటించాలని మున్సిపాలిటీ కార్యవర్గం నిర్ణయించింది. దీనికి స్థానిక వాణిజ్య వ్యాపార సంస్థలు మద్దతు తెలిపాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు అందుబాటులో ఉంటాయి. 10 గంటల తర్వాత ఎవరైనా షాపులు తెరిస్తే జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.
పదిహేను రోజుల లాక్డౌన్ ప్రకటించిన షాపులు - lock down at huzurnagar municipality region
హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వ్యాపార వాణిజ్య సముదాయాలు ఇవాళ నుంచి ఆగస్టు 14వరకు లాక్డౌన్ ప్రకటించాయి. మున్సిపాలిటీ కార్యవర్గం నిర్ణయానికి అన్ని వాణిజ్య వ్యాపార సంస్థలు మద్దతు తెలిపాయి.
![పదిహేను రోజుల లాక్డౌన్ ప్రకటించిన షాపులు shops closed from today till August 14 huzurnagar municipality region](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8243704-1061-8243704-1596188425452.jpg)
పదిహేను రోజుల లాక్డౌన్ ప్రకటించిన షాపులు
వైరస్ వ్యాప్తిని కొంతవరకైనా నివారించవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏదైనా అత్యవసరమైతే స్పెషల్ టీం ద్వారా సహాయం చేస్తాయని మున్సిపల్ అధికారులు వివరించారు.
ఇదీ చూడండి:'అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే భారత్‌కే అధిక ప్రాధాన్యం'
TAGGED:
huzurnagar latest news