సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, శ్రీరామ సైన్యం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్ఆర్ఆర్ మైదానం నుంచి శ్రీరంగాపురం ఆంజనేయస్వామి దేవాలయం వరకు శోభాయాత్రను వైభవంగా జరిపారు.
కోదాడలో శివాజీ జయంతి శోభాయాత్ర - సూర్యాపేట జిల్లా తాజా వార్త
సూర్యాపేట జిల్లా కోదాడలో మరాఠా వీరుడు శివాజీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. ప్రధాన కూడళ్ల గుండా శోభాయాత్రను నిర్వహించారు.
![కోదాడలో శివాజీ జయంతి శోభాయాత్ర shivaji birth anniversary celebrations in suryapet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6126436-372-6126436-1582106184897.jpg)
కోదాడలో శివాజీ జయంతి శోభాయాత్ర
పట్టణంలోని ప్రధాన కూడళ్లు కాషాయ రంగును సంతరించుకున్నాయి. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో ప్రధాన వీధులు మారుమోగాయి.
కోదాడలో శివాజీ జయంతి శోభాయాత్ర
ఇవీ చూడండి:ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి