తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగా మట్టపల్లి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు - shayana ekadasi pooja at mattapalli temple

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ ఏడాది తొలి ఏకాదశి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా వేగంగా విజృంభిస్తున్నందున గురువారం భక్తులకు దర్శనాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

shayana ekadasi pooja at mattapalli temple
నిరాడంబరంగా మట్టపల్లి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు

By

Published : Jul 1, 2020, 4:27 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా ఏటా తెలుగు రాష్ట్రాల భక్తులతో కిటకిటలాడుతుండేది. ఇక్కడ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే అనుకున్న కోరికల నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 41 రోజులు స్వామివారికి పూజలు నిర్వహిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ పూజలు చేసే భక్తులు విశ్వసిస్తారు.

ఈ ఏడాది కరోనా వ్యాప్తి చెందుతున్నందున ఆలయ అధికారులు భక్తుల దర్శనాన్ని రద్దు చేశారు. గురువారం నుంచి భక్తులకు దర్శనం యథావిధిగా ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి :హరితహారం, పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం.. సర్పంచ్ సస్పెన్షన్

ABOUT THE AUTHOR

...view details