సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు శంభు లింగేశ్వరస్వామి దేవాలయంలో జరుగుతున్న ప్రహరీగోడ నిర్మాణ పనులను ఎమ్మెల్యే సైదిరెడ్డి పరిశీలించారు. దేవాలయం చుట్టూ జరుగుతున్న డ్రైనేజి నిర్మాణం, ఇతరత్రా అభివృద్ధి పనులను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
శంభు లింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే - సూర్యాపేటలోని శంభులింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శంభు లింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఛైర్మన్ బోగాల కొండారెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇమ్రాన్, మండల కార్మికశాఖ అధ్యక్షులు సాముల వెంకటరెడ్డి, నేరేడుచర్ల వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, గురుస్వామి, మాశెట్టి రాముడు, అర్చకులు విష్ణువర్ధన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష