పంటలకు అవసరమైన ఎరువులు, క్రిమిసంహారకాలను చల్లేందుకు డ్రోన్ స్ప్రేయర్లు అందుబాటులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామ రైతు వెంకట్ రెడ్డి తనకున్న పొలంలో డ్రోన్ సహాయంతో మందు పిచికారి చేశాడు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు మందు పిచికారి ఏ విధంగా చేస్తున్నారని ఆసక్తిగా తిలకించారు. ఎకరాకు 500 రూపాయలు వరకు డ్రోన్ యజమానికి చెల్లించి పిచికారి చేయిస్తున్నారు. డ్రోన్ ద్వారా మందు పిచికారి చేస్తే పొలం అంతటికి పిచికారి అవుతుందని డ్రోన్ యజమానులు వెల్లడించారు.
సాగులో సంచలనం డ్రోన్ స్ప్రేయర్లు - Pesticides spraying drone in Suryapet telangana
వ్యవసాయంలో సాంకేతికత నానాటికీ పెరుగుతోంది. కూలీల కొరతను అధిగమించడంతో దిగుబడి ఖర్చులు తగ్గించుకుని, అధిక దిగుబడి సాధించేందుకు తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో యంత్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్ రైతులను ఆకర్షిస్తున్నది.
సాగులో సంచలనం డ్రోన్ స్ప్రేయర్లు