తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముందు కుటుంబం తర్వాతే వ్యాపారం'

కరోనా నానాటికీ విజృంభిస్తోన్న తరుణంలో సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ను ప్రకటించాయి. అత్వవసర సేవలు మినహా రేపటి నుంచి 15 రోజుల పాటు అన్ని దుకాణాలు మూసివేస్తున్నట్టు మున్సిపల్​ కమిషన్​ నాగిరెడ్డి వెల్లడించారు.

self lock down at huzurnagar suryapet
ముందు కుటుంబం తర్వాతే వ్యాపారం నినాదంతో స్వచ్ఛంద లాక్​డౌన్​

By

Published : Jul 30, 2020, 4:36 PM IST

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్ పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ ప్రకటించారు. రేపటి నుంచి ఆగస్టు 14 వరకు 15 రోజులు పూర్తి బంద్​ పాటించాలని నిర్ణయించుకున్నారు.

ముందు కుటుంబం తరువాత వ్యాపారం అనే నినాదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారస్తుల సంఘం నాయకులు తెలిపారు. కూరగాయలు, పాలు ప్రతిరోజు ఉదయం 10 గంటల వరకు మాత్రమే అందుబాటు ఉంటాయని.. ఏదైనా అత్యవసరం అయితే స్పెషల్ వాలంటీర్ టీం సాయం చేస్తారని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించారు.

ఇదీ చూడండి:కొత్తగా ఆరు లెదర్ పార్కులు... 3 వేల మందికి ఉపాధి

ABOUT THE AUTHOR

...view details