తెలంగాణ

telangana

ETV Bharat / state

వీఆర్ఓల నుంచి రికార్డుల స్వాధీనం - revenue portfolies news

కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చే యోచనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఓల నుంచి భూ దస్త్రాలను స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించింది. ఇందులో భాగంగా ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గంలో వీఆర్ఓల నుంచి దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

వీఆర్ఓల నుంచి రికార్డుల స్వాధీనం
వీఆర్ఓల నుంచి రికార్డుల స్వాధీనం

By

Published : Sep 7, 2020, 5:09 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వీఆర్ఓలు... దస్తావేజులను తహసీల్దార్ కు అప్పగించారు. వీఆర్ఓల నుంచి అన్ని రకాల రికార్డ్స్ ను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని... అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకొని సీసీఎల్ కు పంపాలని కలెక్టర్లుకు ఇచ్చిన ఆదేశాలలో సీఎస్ స్పష్టంగా పేర్కొన్నారు.

రెవెన్యూ వ్యవస్థపై అవినీతి ఆరోపణలు ఎక్కువ ఉండటం వల్ల రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగానే సీఎం కేసీఆర్... ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details