తెలంగాణ

telangana

ETV Bharat / state

kishan Reddy: కల్నల్​కు నివాళి అర్పించి.. పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో టిఫిన్ చేసి - సూర్యాపేటలో జనఆశీర్వాద యాత్ర

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర.. రెండో రోజు ప్రారంభమైంది. సూర్యాపేటలో తొలిరోజు యాత్రను ముగించుకున్న ఆయన... అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం కల్నల్ సంతోష్​ బాబు విగ్రహానికి నివాళులు అర్పించి... రెండో రోజు యాత్రను ప్రారంభించారు.

kishan Reddy
రెండో రోజు జన ఆశీర్వాద యాత్ర

By

Published : Aug 20, 2021, 9:16 AM IST

Updated : Aug 20, 2021, 10:49 AM IST

సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహనికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో భాగంగా రెండో రోజు యాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి సూర్యాపేటలోని చింతల చెరువులో జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలు అవార్డు గ్రహీత మెరుగు మారుతమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ అల్పాహారం చేసిన కిషన్ రెడ్డి... ఆమెను సన్మానించారు. జాతీయ అవార్డు పొందిన పారిశుద్ధ్య కార్మికురాలు ఇంట్లో అల్పాహారం తినడం ఆనందంగా ఉందని కిషన్ తెలిపారు. కరోనా సమయంలో ఆమె ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా విధులు నిర్వర్తించారని అభినందించారు.

కేంద్ర ప్రభుత్వంలో పని చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ నాకు అవకాశం ఇచ్చారు. ప్రజల నుంచి మరిన్ని ఆశీర్వాదాలు పొంది... కేంద్రం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలి. ప్రజల ఆశీర్వాదం కోసమే ఈ జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించాం. ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ప్రధాని ఆదేశించారు. రైతులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలను కలవాలని సూచించారు. జాతీయ అవార్డు పొందిన పారిశుద్ధ్య కార్మికురాలు మారుతమ్మ ఇంట్లో అల్ఫాహారం తీసుకున్నాను. కొవిడ్​ సమయంలో ఆమె ఒక్క రోజు సెలవు తీసుకోకుండా విధులు నిర్వర్తించారు. ఆమెను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా గుర్తించి అవార్డు అందించింది. కొవిడ్​ను అరికట్టాలంటే ప్రజల సహకారం కావాలి. కరోనా వ్యాక్సిన్​ను అందించడంలో ప్రభుత్వం సఫలమవుతోంది. చిన్నారులకు సైతం వ్యాక్సిన్​ అందేలా పరిశోధనలు జరిగాయి. అవి మంచి ఫలితాలు ఇచ్చాయి. త్వరలోనే 18 ఏళ్లు లోపు వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కల్నల్​ సంతోష్​ బాబుకు నివాళి అర్పించి.. యాత్ర ప్రారంభించి

పర్యటన సాగనుందిలా..

సూర్యాపేటలో యాత్ర తిరిగి ప్రారంభమై మహబూబాబాద్ జిల్లాలోని... దంతాలపల్లి, తొర్రూరు మీదగా రాయపర్తి వద్ద వరంగల్ జిల్లాలోకి ప్రవేశించి... వర్ధన్నపేట మీదుగా వరంగల్ భద్రకాళి దేవాలయానికి చేరుకుంటుంది. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హన్మకొండలోని వెయ్యి స్తంభాల ఆలయంలో పూజలు చేసి... జనగామ మీదుగా యాదాద్రి చేరుకుని.. రాత్రి అక్కడే కిషన్‌రెడ్డి బస చేయనున్నారు. రేపు ఘట్‌కేసర్‌, ఉప్పల్‌ మీదుగా.. నగరంలోకి యాత్ర ప్రవేశించనుంది. నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభతో..... యాత్ర ముగియనుంది.

ఇదీ చూడండి:KishanReddy: తొలిరోజు విజయవంతంగా కిషన్​రెడ్డి యాత్ర.. రెంట్టిపు ఉత్సాహంతో రెండో రోజు..

Last Updated : Aug 20, 2021, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details