తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థికి పెద్ద మనసుతో సాయం చేసిన స్కూలు

విద్యార్థికి సంబంధించి ఫీ అంతా సరిగ్గా కట్టారా.. కట్టకపోతే కట్టండి అని డిమాండ్​ చేసే స్కూల్​ యాజమాన్యాలను చూశాం. కానీ స్కూల్లోని ఓ విద్యార్థి మెదడు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంటే అతని కుటుంబానికి వైద్యం నిమిత్తం సహాయం చేసిన స్కూలును చూడాలనుకుటున్నారా.. అయితే ఈ కథనం చదవండి.

school gave financial support for their school student for his suffering from brain disease in suryapeta
విద్యార్థికి పెద్ద మనసుతో సాయం చేసిన స్కూలు

By

Published : Mar 7, 2020, 6:42 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ పట్టణంలో ఎండీఆర్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి మోహిన్​​ బాబా మెదడు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి గమనించిన స్కూలు యాజమాన్యం మానవత్వంతో స్పందించింది.

వైద్య సహాయ నిమిత్తం స్కూల్ తరఫున విద్యార్థి తండ్రి రఫీకి రూ.1,02,154 చెక్కును పాఠశాల ఛైర్మన్ దామోదర్ రెడ్డి అందజేశారు. ఈ ఆర్థిక సహాయం అందుకున్న మోహిన్​ తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థికి పెద్ద మనసుతో సాయం చేసిన స్కూలు

ఇదీ చూడండి:విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణతోనే దేశరక్షణ!

ABOUT THE AUTHOR

...view details