ప్రభుత్వ పాఠశాలలు స్కావెంజర్స్‌ను తొలగించారదని... మెమో 2026ను రద్దు చేయాలని.. స్కావెంజర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండల కేంద్రంలో స్కావెంజర్ల జనరల్ బాడీ సమావేశం నెహ్రు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఎక్స్‌రోడ్ వద్ద ఆందోళన చేపట్టారు.
స్కావెంజర్స్‌ను కొనసాగించాలని.. సూర్యాపేట జిల్లాలో ఆందోళన
సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండల కేంద్రంలో స్కావెంజర్ల జనరల్ బాడీ సమావేశం నెహ్రు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఎక్స్‌రోడ్ వద్ద ఆందోళన చేపట్టారు.
స్కావెంజర్స్‌ను కొనసాగించాలని.. సూర్యాపేట జిల్లాలో ఆందోళన
గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 28,500 మంది కార్మికులు పని చేస్తున్నారని వీరందరికి పని బారెడు జీతము బెత్తెడు అన్న సామెత అయ్యిందని విమర్శించారు. కేవలం నెలకు 2 వేల నుంచి రెండున్నర వేలు మాత్రమే చెల్లిస్తున్నారని.. ఇది కనీస వేతనాల చెల్లింపు చట్టానికి వ్యతిరేకమైనదని అన్నారు. తక్షణమే మెమో 2026 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.