తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక్కడ పెట్రోలు కొట్టిస్తే జేబుకు చిల్లే... - సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో పెట్రోల్​ బంకు అక్రమాలు

ప్లాస్టిక్​ బాటిల్లో పెట్రోలు పోయడం నిషేధమని పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఇదే అదునుగా భావించి వినియోగదాల జేబులకు పెట్రోల్​ బంకు యజమానులు చిల్లు పెడుతున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంకులో అవకతవకలు జరుగుతున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

ఇక్కడ పెట్రోలు కొట్టిస్తే జేబుకు చిల్లే...

By

Published : Nov 24, 2019, 11:05 PM IST

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ఓ పెట్రోలు బంకు యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని హెచ్​పీ పెట్రోలు బంకులో తక్కువ పెట్రోలు పోసి సొమ్ము కాజేస్తున్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్​ రహిత నగరంగా మార్చాలనే ఉద్దేశంతో పోలీసులు ప్లాస్టిక్​ బాటిల్​లో పెట్రోలు పోయడం నిషేధించిన నేపథ్యంలో వారి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు. అక్కడ బంకులో ఓ బాటిల్​లో పెట్రోల్​ పోయించి... పక్కనున్న మరో బంకులో పోయించిన పెట్రోల్​తో పోల్చగా భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్చించారు. పెట్రోల్​ బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

ఇక్కడ పెట్రోలు కొట్టిస్తే జేబుకు చిల్లే...
ఇదీ చూడండి: నకిలీ ధ్రువపత్రాల కేసులో ఇద్దరు అరెస్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details