కరోనాను కట్టడి చేసేందుకు ప్రజాప్రతినిధులే స్వయంగా పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మదిరాల మండలం పోలుమళ్ళలో ఒక పాజిటివ్ కేసు నమోదు కావటం వల్ల అప్రమత్తమైన సర్పంచ్ చిలువేరు భవానీ గ్రామంలో ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులను దగ్గరురండి పరిశీలిస్తున్నారు.
స్వయంగా రంగంలోకి దిగిన సర్పంచ్ - LOCK DOWN EFFECT
గ్రామంలో ఒక కరోనా కేసు నమోదైంది... ఇక ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. కానీ... ఆ ఊరి ప్రథమ మహిళ మాత్రం వారికి ధైర్యంగా నిలబడింది. గ్రామస్థులకు ఏం కాకూడదని... తానే స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ మంచి సందేశమిస్తోంది.
స్వయంగా రంగంలోకి దిగిన సర్పంచ్
పంచాయతీ సిబ్బందితో కలసి వీధుల్లో స్వయానా బ్లీచింగ్ చల్లుతున్నారు. ప్రతీ ఒక్కరు భౌతికదూరంతో పాటు పరిశుభ్రతను పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ చేస్తున్న సేవలను గ్రామస్థులు అభినందిస్తున్నారు.