కరోనాను నియంత్రించడంలో తాను సైతం అంటూ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమళ్ల సర్పంచ్ భవాని ముందుకొచ్చింది. తానే స్వయంగా పవర్ బ్లోయర్ను భుజాన వేసుకొని గ్రామంలోని ప్రతి వీధిలో హైడ్రోక్లోరైడ్ ద్రావకాన్ని పిచికారీ చేసింది. ప్రజలెవరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఇంటింటికీ కూరగాయలను సరఫరా చేస్తుంది.
కరోనాను తరిమికొట్టడానికి తాను సైతం అంటోన్న పోలుమళ్ల గ్రామ సర్పంచ్
కరోనాను తరిమికొట్టడానికి తాను సైతం అంటూ సూర్యాపేట జిల్లా పోలుమళ్ల గ్రామ సర్పంచ్ నడుం బిగించింది. ఓవైపు పేద ప్రజలకు నిత్యావసరాలు అందిస్తూ... మరో వైపు గ్రామంలో పలు రక్షణ, ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
కరోనాను తరిమికొట్టడానికి తాను సైతం అంటోన్న పోలుమళ్ల గ్రామ సర్పంచ్
కరోనాపై గ్రామంలోని ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేస్తూ వ్యక్తిగత పరిశుభ్రతను, భౌతిక దూరాన్ని విధిగా పాటించాలంటూ అవగాహనా కల్పిస్తోంది. విధిగా మాస్కలు వాడాలని చెప్తూ తానే స్వయంగా ఇంట్లో సొంతగా తయారు చేసి ప్రజలకు అందజేస్తుంది. గ్రామ అభివృద్ధి, ప్రజల రక్షణ కోసం సర్పంచ్ భవాని చేస్తున్న సేవను గ్రామస్థులు అభినందిస్తున్నారు.
TAGGED:
latest news of suryapeta