సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు సర్పంచ్ జోగు సరోజిని పిచ్చిరెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఐదేళ్లలో తనకు వచ్చే వేతనం మూడు లక్షల రూపాయలను గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని ప్రకటించారు. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ నిర్మాణానికి, లైబ్రరీ అభివృద్ధికి వినియోగిస్తానని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని పొనుగోడు గ్రామ సర్పంచ్ అన్నారు. గ్రామాభివృద్దే ప్రధాన అజెండాగా తాను గ్రామంలో డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామన్నారు.
గ్రామాభివృద్దే ఆ గ్రామ సర్పంచ్ ధ్యేయం - గ్రామాభివృద్దే ఆ గ్రామ సర్పంచ్ ధ్యేయం
గ్రామానికి వచ్చిన నిధులను ఎలా దోచుకుందామా... ఎలా తిందామా అని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారు పొనుగోడు గ్రామ సర్పంచ్. తనకు వచ్చే ఐదేళ్ల వేతనం మూడు లక్షల రూపాయలను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తానని సర్పంచ్ జోగు సరోజిని తెలిపారు.
![గ్రామాభివృద్దే ఆ గ్రామ సర్పంచ్ ధ్యేయం sarpanch 3 lakhs donation to village development in suryapet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7198841-663-7198841-1589464758956.jpg)
గ్రామాభివృద్దే ఆ గ్రామ సర్పంచ్ ధ్యేయం
ఇకముందు కూడా హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు జోగు అరవింద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?'