హుజూర్నగర్ ప్రజలకు రుణపడి ఉంటా: సైదిరెడ్డి - huzurnagar assembly constituency results 2019
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో తన గెలుపు ఖాయమని తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలన్నీ ఏకమైనా.. ప్రజలు మాత్రం తెరాస వైపే ఉన్నారని తెలిపారు.

హుజూర్నగర్ ఉపఎన్నికలో తన గెలుపు లాంఛనమని తెరాస అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. తెరాస విజయాన్ని ముందుగానే ఊహించామని తెలిపారు. ప్రతి ఊరు, ప్రతి బూత్‌లో కారు గుర్తుకే ఓటేశారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి దాడులకు దిగాయన్న ఆయన ఈసీతో కలిసి ఒక సందర్భంలో ఎన్నికను వాయిదా వేయాలని చూశాయని ఆరోపించారు. తన పేరుకు దగ్గరగా ఉన్న 20 మందికి పైగా వ్యక్తులతో నామినేషన్ వేయించారని.. కారు గుర్తును పోలి ఉండే గుర్తుతో పోటీ చేశారని సైదిరెడ్డి అన్నారు. కాంగ్రెస్, భాజపా 2వేల మందితో ప్రచారం నిర్వహించినా... ఓటమి పాలయ్యారన్నారు. హుజూర్నగర్ నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని మాటిచ్చారు.