RS Praveen Kumar Speech: రాబోయే రోజుల్లో బహుజన, దళిత గిరిజన శక్తులు ఏకమై ప్రగతిభవన్‌పై బీఎస్పీ జెండా ఎగురవేయడం ఖాయమని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆయన పర్యటించారు. పట్టణంలో బీఎస్పీ శ్రేణులు ర్యాలీ చేపట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికారు. పెరక హాస్టల్లో బీఎస్పీ కార్యకర్తలతో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీ పార్టీలో చేరారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య పోవాలన్న.. రైతు రాజ్యం రావాలన్న.. సంక్షేమ ఫలాలు అందాలన్న బీఎస్పీ జెండా చేతపట్టాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి రాబోయే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని అన్నారు. బతుకులు మారాలంటే బహుజన రాజ్యం రావాలని అన్నారు. అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోదాడలో జన ఆదరణ ఉన్న పిల్లుట్ల శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా కోరగా.. సానుకూలంగా స్పందించిట్లు సమాచారం.
బీఎస్పీని గెలిపించాలి..