గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద చెరువు అలుగు పోయడం వల్ల పసునూరుకు వెళ్లే రహదారిలో కల్వర్టు ధ్వంసమైంది. వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్.. వెంటనే అధికారులతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన తాత్కాలిక రోడ్డు మరమ్మతులను చేయించారు.
తుంగతుర్తి నుంచి పసునూరు వరకు డబుల్ బీటీ రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయని, అధిక వర్షాల వల్ల పనులు జరగడంలో ఆలస్యమవుతోందని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాలు తగ్గిన వెంటనే వచ్చే నెలలో పనులను మొదలుపెట్టి తుంగతుర్తి నుంచి పసునూరు వరకు డబుల్ బీటీ రోడ్డు వేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులు, జిల్లా తెరాస పార్టీ నాయకులు గుండ గాని రాములు గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నల్లు రాంచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
యుద్ధ ప్రాతిపదికన రోడ్డు కల్వర్టు మరమ్మతులు - suryapet district news
తుంగతుర్తికి చెందిన పెద్ద చెరువు అలుగు పోయడం వల్ల పసునూరుకు వెళ్లే రహదారిలో కల్వర్టు ధ్వంసం కాగా... ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ యుద్ధప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేయించారు. వచ్చే నెలలో తుంగతుర్తి నుంచి పసునూరు వరకు డబుల్ బీటీ రోడ్డు వేయిస్తామన్నారు.

యుద్ధ ప్రాతిపదికన రోడ్డు కల్వర్టు మరమ్మతులు