సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుడుగుంట్ల పాలెం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మమ్మ అనే మహిళకు గాయాలయ్యాయి. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం నేరేడుచర్ల వెళ్లి వస్తుండగా... ఎదురుగా వస్తున్న గేదెలు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాయి. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి.
మానవత్వం చాటిన ఎస్సై - Road Accident in Suryapeta district
సూర్యాపేట జిల్లాలో ఓ ఎస్సై మానవత్వన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నిస్సహాయురాలిగా ఉన్న మహిళను పోలీసు వాహనంలో తీసుకెళ్లి వైద్యం చేయించాడు.
మానవత్వం చాటిన ఎస్సై
ఇది గమనించిన స్థానికులు పాలకీడు ఎస్సైకి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని పోలీసు వాహనంలో తీసుకెళ్లి వైద్యం చేయించి మానవత్వన్ని చాటుకున్నారు.
ఇవీ చూడండి:గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..