సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నాగారం శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో గ్రామానికి చెందిన చాగంటి మధు ద్విచక్రవాహనంపై అర్వపల్లి నుంచి అనంతారంకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.
ట్రాక్టర్‌ను ఢీ కొన్న ద్విచక్రవాహనం.. ఒకరు మృతి
సూర్యాపేట జిల్లా నాగారం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ద్విక్రవాహనదారుడు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
ట్రాక్టర్‌ను ఢీ కొన్న ద్విచక్రవాహనం.. ఒకరు మృతి
నాగారం బంగ్లా శివారు రైస్‌మిల్లు సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టరును ఢీ కొట్టగా తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మధు మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్ఐ వెంకన్న తెలిపారు.
ఇదీ చూడండి:భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన