తెలంగాణ సర్కార్ ఆదేశాలతో రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దయింది. సూర్యాపేట జిల్లాలో ఆయా మండలాల్లోని వీఆర్వోలు తమ గ్రామాల పరిధిలోని మొత్తం రికార్డులను తహసీల్దార్ కార్యాలయాలకు తరలించారు. ఈ మేరకు ఆయా గ్రామాలకు సంబంధించిన రికార్డులను అప్పగించే పనిలో నిమగ్నమయ్యారు.
రెవెన్యూ దస్త్రాలు సమర్పించిన వీఆర్వోలు - revenue records submitted to MROs in suryapet district
వీఆర్వో వ్యవస్థ రద్దు ఆదేశాలతో సూర్యాపేట జిల్లాలో ఆయా మండలాల్లోని వీఆర్వోలు తమ గ్రామాల పరిధిలోని రికార్డులను తహసీల్దార్ కార్యాలయాలకు తరలించారు. వీఆర్వోలు అప్పగించిన రికార్డులను ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరిచారు.

సూర్యాపేట జిల్లాలో రెవెన్యూ దస్త్రాలు సమర్పించిన వీఆర్వోలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద రికార్డులు తీసుకొచ్చిన వీఆర్వోలు.. వివిధ రకాల రికార్డులను అప్పగిస్తున్నట్లు ధ్రువీకరించే పత్రాలను ఎమ్మార్వోలకు సమర్పించారు. దస్త్రాలను తహసీల్దార్ కార్యాలయాల్లోని గదిలో భద్రపరుస్తున్నారు. పూర్తి ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పలు మండలాల్లో పర్యటించారు.
- ఇదీ చూడండి:నూతన విద్యావిధాన ఆదర్శాలు అమలయ్యేనా?