సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామం వద్ద రహదారిపై నిర్మిస్తున్న వంతెనపై ఈటీవీ-ఈటీవీ భారత్లో వచ్చిన ''గుత్తేదారుల నిర్లక్ష్యంతో.. నిలిచిపోయిన వంతెన నిర్మాణం''కథనానికి అధికారులు స్పందించారు. 81 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసి వంతెనను పూర్తి స్థాయి అందుబాటులోకి తీసుకురావడానికి పనులు ప్రారంభించారు.
కళ్లు తెరిచిన అధికారులు..వంతెన నిర్మాణానికి నిధులు విడుదల - Funds for the construction of a bridge to be built in Polenigudum
సూర్యాపేట జిల్లా పోలేనిగూడెంలో నిర్మిస్తున్న వంతెనపై ఈటీవీ భారత్లో వచ్చిన ''గుత్తేదారుల నిర్లక్ష్యంతో.. నిలిచిపోయిన వంతెన నిర్మాణం'' శీర్షికన ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు.
మూడు సంవత్సరాల క్రితం వంతెన నిర్మాణానికి 1.98 కోట్ల రూపాయలతో మొదలు పెట్టగా... అప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈనెల 5న ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు... మిగిలిన బకాయిలను 81 లక్షల రూపాయలను కాంట్రాక్టర్లకు చెల్లించారు. వంతెన పనులు ప్రారంభమయ్యాయి. దీనితో పోలేనిగూడెం గ్రామస్థులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం:గుత్తేదారుల నిర్లక్ష్యంతో.. నిలిచిపోయిన వంతెన నిర్మాణం