'ఈనాడు-ఈటీవీ భారత్'లో గత నెల 8న ప్రచురితమైన 'ఆధార్ లేక-ఆసరా దక్కక' కథనానికి స్పందన లభించింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం వెంకేపల్లికి చెందిన వృద్ధ దంపతులు పిట్టల పాపయ్య, రామనర్సమ్మలకు పలువురు దాతలు అండగా నిలిచారు. రూ.15 వేల నగదు, నిత్యావసరాలు సమకూర్చి.. గ్రామ సర్పంచ్ మాతంగి సోమనర్సమ్మ చేతుల మీదుగా వాటిని వృద్ధ దంపతులకు గురువారం అందించారు.
ఈ సందర్భంగా దాతలు స్పందించి సాయం చేసినా.. అధికారులు మాత్రం ఒక్కరూ స్పందించలేదని, వృద్ధ దంపతులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని గ్రామస్థులు మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. ఇంట్లో ఒక్కరికైనా పింఛన్ అందించాలని కోరారు.