తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ నెల 4 వరకు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోండి' - suryapet news

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలోని పలు గ్రామాల్లోని రైతు కుటుంబాలు ఈ నెల నాలుగు వరకు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో రైతుల పేర్ల జాబితాను ప్రదర్శించారు.

raithu bheema applications invated till 4th
raithu bheema applications invated till 4th

By

Published : Sep 2, 2020, 5:47 PM IST

ఈ నెల నాలుగు వరకు రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వ్యవసాయ అధికారి ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. మండల పరిధిలోని బండ్లపల్లి గుండెపురి, వెలిశాల, సిద్ధి సముద్రం, మొండి చింతల తండ, కోట్యతండ, రాజ్ నాయక్ తండ, జలాల్ పురం, మామిడాల, తాటిపాముల తొండ, గ్రామపంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లో బీమా పొందిన రైతుల జాబితాను ప్రదర్శించారు.

జాబితాలో ఉన్న రైతులందరు ఈ నెల 4 వరకు రైతు భీమ పథకానికి చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు నకలు, రైతు నామిని ఆధార్ కార్డు నకలు ప్రతులతో వ్యవసాయ అధికారి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వెంకట్ రెడ్డి, జి.శ్రీను, సర్పంచులు మోహన్ బాబు, బెడిది కరుణాకర్, పంచాయతీ కార్యదర్శులు బింజా, మంగమ్మ పాల్గొన్నారు.

'ఈ నెల 4 వరకు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోండి'

ఇదీచూడండి..' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'

ABOUT THE AUTHOR

...view details