తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు రోజులుగా వర్షాలు.. మునిగిపోయిన పంట పొలాలు - Submerged crop fields

సూర్యాపేట జిల్లా చింతల పాలెం బుగ్గమాదరం వద్ద గత రెండు రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Rain for two days Submerged crop fields at buggabadharam suryapet
రెండు రోజులుగా వర్షాలు.. మునిగిపోయిన పంట పొలాలు

By

Published : Jul 15, 2020, 1:09 PM IST

రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఈ తరుణంలో సూర్యాపేట జిల్లా చింతల పాలెం బుగ్గమాదరం వద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద నీరు చేరి పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిందని రైతులు వాపోతున్నారు.

ముఖమాదారం నుంచి పులిచింతల, దొండపాడు చింతలపాలెం గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి :నిరవధిక సమ్మెలో గాంధీ ఆస్పత్రి పొరుగుసేవల సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details