ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వలస కార్మికులకు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. క్వారంటైన్ ముద్రలు కూడా వేసి వారిని వారి ఇళ్లకు పంపిస్తున్నారు. ప్రతీ ప్రయాణికుడిని పరీక్షించాకే ఇళ్లకు పంపిస్తున్నట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు.
చెక్పోస్ట్ వద్దే క్వారంటైన్ ముద్రలు - ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వారిని చెక్పోస్ట్ వద్ద క్వారంటైన్ ముద్రలు
ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వలస కార్మికుల వద్ద అనుమతి పత్రాలను పరిశీలించి, ప్రతీ ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేశాకే రాష్ట్రంలోకి రానిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 315 మందికి హోమ్ క్వారంటైన్ ముద్రలు వేసినట్లు వెల్లడించారు.
![చెక్పోస్ట్ వద్దే క్వారంటైన్ ముద్రలు ramapuram check posr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7057248-96-7057248-1588592718706.jpg)
చెక్పోస్ట్ వద్దే క్వారంటైన్ ముద్రలు
ఏపీ నుంచి వస్తున్న వలస కార్మికుల వద్ద అనుమతి పత్రం ఉంటేనే తెలంగాణలోకి రానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 315 మందికి హోమ్ క్వారంటైమ్ ముద్రలు వేసినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి:హైదరాబాద్లో ఒక్క రోజులోనే 20 కేసులు